
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- అప్పుల బాధతో కన్న కూతుర్లనే చంపేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. అప్పుల బాధతో… ఏం చేయాలో దిక్కుతోచక తనకున్న ముగ్గురు కూతుర్లను గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత మరొక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లా, రాసి పురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి తనకున్న ముగ్గురు కూతుర్లను గొంతు కోసి చంపేశాడు. ఇక ఆ తరువాత తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరగకముందు భార్య మరియు కొడుకును ఒక గదిలో బంధించి ఆ తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అప్పులు ఎక్కువైన కారణంగానే తనకు జన్మించిన ముగ్గురు కూతుర్లను హతమార్చినట్లుగా సమాచారం అందింది. ఇప్పటికే ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో హైలైట్ గా నిలిచింది. పూర్తి వివరాలు తెలియదు కానీ… ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన తరువాత చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని రకాలుగా చర్చిస్తున్నారు. అప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం కన్నా కూతుర్లనే గొంతు కోసి చంపేస్తారా?… అని ఆ తండ్రిపై మండిపడుతున్నారు. మరోవైపు చనిపోతే నువ్వు చనిపోవాలి కానీ… అభం శుభం తెలియని చిన్నారులను చంపేయడమేంటని?.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవడంతో… ఇతను ఏం తండ్రి అని ఆగ్రహానికి గురవుతున్నారు.
Read also : చనిపోయిన మహిళ అకౌంట్లో లక్ష కోట్లు.. ఎక్కడి నుంచి వచ్చినట్లు?
Read also : పిఠాపురంలో ఉప్పాడ గోడ చిచ్చు – టీడీపీ, జనసేన మధ్య నలిగిపోతున్న అధికారులు