క్రైమ్జాతీయంతెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!

మహారాష్ట్రకు చెందిన డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. ఆయన బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

  • మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళ్తున్న కారు.

  • పీకేట్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు..!

  • ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొట్టింది.

క్రైమ్ మిర్రర్, అచంపేట్ : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లి‍, దోమల పెంట మధ్యలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. అందులో మహారాష్ట్రకు చెందిన డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. ఆయన బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం.

ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతం దోమల పెంట గ్రామానికి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం పై ఈగలపెంట ఎస్సై వీరమల్లు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కొందరు శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. సరిగ్గా దోమల పెంట గ్రామ సమీపంలోకి రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న పీకేట్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇన్నోవా కార్ లో ఉన్న ఇద్దరికీ బలమైన గాయాలు అయ్యాయన్నారు.

వెంటనే ఆ ఇద్దరు క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్స్ తో పాటు ఈగల పెంట ఎస్సై పోలీసు వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం పంపించారు క్షతగాత్రులలో ఒకరు డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ మహారాష్ట్ర, రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారని, ఈయనకు తల పై బలమైన గాయాలు అయినట్లు సమాచారం. మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు రెండు కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయని సమాచారం. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దండ సమీపంలో ఉన్న ఎన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.

ఇవి కూడా చదవండి .. 

  1. టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం..!

  2. వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

  3. ఆ మంత్రి పదవి కోసం నలుగురు పోటీ – రాజగోపాల్‌రెడ్డి ఆశ నెరవేరానా?

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button