
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా, చిలకలూరిపేట బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. 6 గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ వెనక భాగం ను ఢీకొట్టగా అక్కడికక్కడే కారులో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అయితే కారులోని వ్యక్తులు గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా చిలకలూరిపేట వద్ద ఈ ఘటన జరిగింది. అయితే ఇందులో మరణించిన వారందరూ కూడా యువకులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన యువకుల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడ్డ వారిని గుంటూరుకి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదపు ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు త్వరలోనే తెలపనున్నారు.
Read also : రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం.. అధికార పార్టీ సర్పంచి అభ్యర్థికి ప్రత్యేక అనుమతులు!
Read also : శాస్త్రీయత లేని నిర్ణయం..! పాలనా సౌలభ్యం… ప్రజలకు కొత్త కష్టాలే..!!





