
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కామారెడ్డి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచి ఎన్నికలలో గెలవగా ఓడిన అభ్యర్థిపై కోపంతో ట్రాక్టర్ తో ఢీ కొట్టి మరి గాయపరిచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, సోమార్ పేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు అతనికి వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజును ట్రాక్టర్ తో ఢీకొట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అని.. తనను ఎవ్వరు ఏం చేయలేరు అంటూనే ఓడిపోయిన బిఆర్ఎస్ అభ్యర్థి కుటుంబం పై ట్రాక్టర్ తో ఢీ కొట్టారు.
Read also : 17 ఏళ్లకే సైంటిస్ట్ అట.. సోషల్ మీడియాలో ఫుల్ మీమ్స్?
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా అండతోనే గెలిచిన పాపయ్య సోదరుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలలో ఫలితాలు వచ్చిన అనంతరం ఇంటి ముందు కూర్చున్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థిని అలాగే అతని కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ అభ్యర్థి అలాగే అతని బంధువులను వెంటనే స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక వెంటనే నియోజకవర్గ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. సర్పంచ్ ఎన్నికలలో గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకులు తారా స్థాయిలో రెచ్చిపోతున్నారు అని గ్రామస్తులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు.. రికార్డు స్థాయిలో దర్శనాలు?





