
-
కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్
-
నలుగురు కార్మికులకు గాయాలు
-
తప్పిన పెనుప్రమాదం, పట్టించుకోని అధికారులు
క్రైమ్ మిర్రర్, మేడ్చల్: పోచారం పోలీస్‌స్టేషన్ పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్ వర్సిటీలో పెనుప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలడంతో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
వర్షాకాలంలో “వీకెండ్ టూర్”… మన తెలంగాణలో వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలుసా?
అనురాగ్ వర్సిటీపై ఫిర్యాదులు
వెంకటాపూర్‌లోని అనురాగ్ వర్సిటీపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్టీఎల్‌లో భవనాలు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.