
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రైతులందరూ కూడా కాలర్ ఎగరవేసుకునేలా చేస్తామని చెప్పిన మీరు నేడు రైతులకు ఎండమావులు చూపిస్తుంది అని సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది కదా.. ఏనాడైనా సరే రైతులను ఉద్దేశించి మాట్లాడారా లేదా అండగా నిలబడ్డారా?.. అని ప్రశ్నించారు. గత మా ప్రభుత్వంలో రైతులు ఏవిధంగా సంతోషంగా జీవితాన్ని గడిపారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని మరోసారి తెలిపారు. రైతుల కష్టాలు, వారు పడుతున్న బాధలపై ఏనాడైనా చర్చ జరిపారా.. అలా ఏ కార్యక్రమమూ నిర్వహించకుండా డైవర్షన్ పబ్లిసిటీ స్టంట్ ‘ రైతన్న.. మీ కోసం’ కార్యక్రమం అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఒంటిమీద చొక్కా తీసేసి రోడ్డు మీద నిలబెట్టారు అని తీవ్రంగా ఫైర్ అయ్యారు. దయచేసి ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించి.. రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వారిని సంతోషంగా ఉండేలా చేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే విజ్ఞప్తి చేశారు.
Read also : Karnataka Politics: రంజుగా మారిన కన్నడ రాజకీయాలు, సీఎం రేసులోకి హోంమంత్రి!
Read also : Justice Surya Kant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. ఇవాళే ప్రమాణ స్వీకారం!





