సినిమా

రవితేజ – సమంత కాంబినేషన్ లో సినిమా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో బిజీగా గడుపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత హీరోయిన్ సమంతతో రవితేజ ఒక సినిమా చేయబోతున్నట్లుగా సినిమా ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ శివ నిర్వహణలో వీరిద్దరూ ఒక సినిమా చేయబోతున్నారు అంటూ సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే డైరెక్టర్ శివ ‘మజిలీ మరియు ఖుషి’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీశారు. అదేవిధంగా ఈ రెండు సినిమాల్లో కూడా సమంతనే హీరోయిన్ గా నటించింది. దీంతో మరోసారి దర్శకుడు శివ తను రవితేజతో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సమంతను సంప్రదించినట్లుగా సమాచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ రవితేజ మరియు సమంత కాంబినేషన్లో సినిమా వచ్చినట్లయితే ఆ సినిమాను చూడడానికి కచ్చితంగా ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే మూవీ తో బాగా బిజీగా ఉండగా మరోవైపు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనేది సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఇద్దరు పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే రవితేజ మరియు సమంత కాంబినేషన్ లో సినిమా తీయబోతున్నట్లుగా సినీ వర్గాలు తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందా అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రవితేజతో సమంత నటించిన ఒకవైపు రవితేజ ఫాన్స్ మరోవైపు సమంత ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు.

Read also : Wonderful: రోజురోజుకూ పెరుగుతున్న శివలింగం!.. ఎక్కడో తెలుసా?

Read also : Hindu Tradition: కార్తీకమాసంలో దీపారాధన ఎందుకు చేయాలో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button