
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- శ్రీశైలం భక్తులకు అలర్ట్… ఆన్లైన్లో శ్రీశైలంకు సంబంధించి నకిలీ వెబ్సైట్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చేటువంటి ఎంతోమంది భక్తులకు వసతులు కల్పిస్తామంటూ కొన్ని వెబ్ సైట్ల ద్వారా కొంతమంది దుండగులు భారీ మొత్తంలో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. శ్రీశైలంలో స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి ఎంతోమంది భక్తులకు వసతులు కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ టూరిజం, శ్రీశైలం దేవస్థానం అనే పేర్లతో ఫేక్ వెబ్సైట్లు ద్వారా ఇప్పటికే చాలామందిని మోసం చేశారు. తాజాగా ఓ వ్యక్తి ఇవే వెబ్సైట్లో 30 వేల రూపాయలతో రూమ్స్ బుక్ చేసుకున్నారు. ఇక శ్రీశైలం చేరుకున్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్లి రషీద్ చూపించగా సిబ్బంది ఇది నకిలీది అని తేల్చి చెప్పారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే షాక్ అయ్యాడు. ఈ వ్యక్తి లాగే పలువురు వ్యక్తులు మోసాలకు గురయ్యారని శ్రీశైలం దేవస్థానం అధికారులు గుర్తించారు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ఫేక్ వెబ్సైట్లో ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారిపై ఆలయ అధికారులు వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. కాబట్టి శ్రీశైలం వచ్చేటువంటి భక్తులందరూ కూడా వసతుల కోసం ఇక్కడకు వచ్చి నేరుగా రషీదు తీసుకోవాలని.. తెలియని ఆన్లైన్ వెబ్సైట్లో డబ్బులు కట్టి మోసపోకండి అని అన్నారు. ఇలాంటి మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి అని కోరారు.
Read also : బ్రేకింగ్ న్యూస్… బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి!
Read also : ఇదేమి ఆట గురు.. ఇలానే ఆడితే భవిష్యత్తులో కష్టమే!





