హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: ఈ ఫేక్ డాక్టర్ కనీసం పదో తరగతి కూడ పాసు కాలేదు కాని 20 ఏళ్లుగా దంతవైద్యుడిగా చలమాణి అవుతూ రాత్రి వేళల్లో క్లినిక్ నిర్వహిస్తు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఈ ఫేక్ డాక్టర్ ఉత్తర్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. పక్క సమాచారంతో మల్కాజ్‌గిరి పోలీసులు దాడి చేసి ఈ ఫేక్ డాక్టర్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
కనీస విద్యార్హతలు లేకుండా 20 ఏళ్లుగా దంతవైద్యుడిగా కొనసాగుతున్న రమేశ్ నెరేడ్‌మెట్‌లో డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. రమేశ్ 20 ఏళ్లుగా బీడీ ఎస్ డాక్టర్ గా వైద్యం చేస్తూ చలమాణ అవుతూ ఎవరికి అనుమానం రాకుండా రాత్ర వేళ్లలో మాత్రమే క్లినిక్ నిర్వహిస్తున్నాడు. రమేశ్ చేస్తున్న చికిత్స పై పలువురికి అనుమానం రావడంతో పోలీసులకు అనుమానం రావడంతో దీంతో పోలీసులు క్లినిక్‌పై దాడి చేసి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నకిలి సర్టిఫికేట్, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైద్య నిపుణుల సూచన ప్రకారం, అనధికారిక లేదా నకిలీ డాక్టర్ల వద్ద చికిత్స పొందడం ఆరోగ్యానికి ప్రమాదకరం. మీ దంత సమస్యల కోసం లైసెన్స్ కలిగిన నిపుణులనే సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.
