నిఘా నేత్రాల నీడలో పోలింగ్.. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి

✍️ఎన్నికలకు సర్వం సిద్ధం..111 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు*
✍️పట్టణంలో 17 ప్రాంతాలు.. 54 కేంద్రాలు
✍️వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం.. ఓటింగ్‌కు పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు
✍️హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు*
క్రైమ్ మిర్రర్, హుజూర్ నగర్:- రేపు అనగా బుధవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పట్టణ వ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 54 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల పటిష్ట పోలీస్ బందోబస్తు
శాంతిభద్రతల పరిరక్షణ కోసం అడిషనల్ ఎస్పీని ఇన్‌చార్జిగా నియమిస్తూ, భారీ పోలీస్ బలగాలను రంగంలోకి దించారు.మొత్తం 111 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పట్టణాన్ని ఆరు మార్గాలుగా విభజించి, ప్రతి మార్గంలో సీఐ, ఎస్సై మరియు ఇతర సిబ్బందితో నిరంతరం నిఘా ఉంచామని ఓటింగ్ ప్రక్రియ అంతా ‘నిఘా నేత్రాల’ పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
మున్సిపాలిటీ పరిధిలో 12 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. మనల్ని పరిపాలించే సరైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారానే సాధ్యం. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలనీ అన్నారు.
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
ఓటింగ్ సమయంలో వృద్ధులు మరియు వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారిని పోలింగ్ కేంద్రాల లోపలికి తీసుకువెళ్లేందుకు వీల్ చైర్స్ (Wheelchairs) ఏర్పాటు చేయడమే కాకుండా, వారు సులభంగా ఓటు వేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ముందస్తు చర్యలుగా.. బైండోవర్లు
ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని భావిస్తున్న 402 మందిని గుర్తించమని .అందులో 215 మందిని ఇప్పటికే బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 10 లిక్కర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.



