
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రతిరోజు ఎగసిపడే బంగారం ధరలు ఇప్పుడు కాస్త కూలిపోయాయి. ఎన్నడూ ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయినటువంటి బంగారపు ధరలు అనేవి నేడు కంప్లీట్ గా డౌన్ అయ్యాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా తొమ్మిది వేలు పడిపోవడంతో… దేశవ్యాప్తంగా బంగారం కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కిలో వెండి 1,74, 900 రూపాయలకు చేరింది. గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అనేక దేశాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో సాధారణ పరిస్థితిలోకి బంగారం ధరలు వచ్చాయి.
Read also : కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్‌లో చేరిక
హైదరాబాదులో ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గాయి. అక్టోబర్ 23 బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,27,200 కు తగ్గింది. ఇది నిన్నటితో పోలిస్తే దాదాపు 3380 తగ్గింది. ఇదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3100 తగ్గి ప్రస్తుతం 1, 16,600 వద్ద ఉంది. దీంతో బంగారం అంటే ఇష్టం ఉన్నవారు బంగారపు దుకాణాలకు క్యూ కడుతున్నారు. ధరలు తగ్గినప్పుడు మాత్రమే మధ్యతరగతి కుటుంబాలు వారు కూడా ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు పెరుగుతూ పోయే బంగారం గత కొద్ది రోజుల నుంచి కాస్త తగ్గుతూ వస్తుంది. దీంతో బంగారం కొనుగోలు కూడా ఎక్కువయింది. మరో వైపు ఈ రేట్లు ఇంతే స్థిరంగా అయితే ఉండవు అని… ఎప్పటికప్పుడు మళ్లీ రేట్లు తిరిగి అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది బంగారపు దుకాణాల వ్యక్తులు సూచిస్తున్నారు.
Read also : నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంనీ కలిసా : పోచారం శ్రీనివాస్ రెడ్డి