తెలంగాణ

పల్లెల్లో బెల్టు షాపులు పెంచాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చార రాష్ట్ర ఆదాయం క్రమంగా తగ్గుతూ వస్తోంది. హైడ్రా దెబ్బకు మరింత దిగజారింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వానికి ఇబ్బంది అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 14 హామీలు ఉండగా.. ఇప్పటివరకు నాలుగు మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేశారు. పెన్షన్ పెంపు, ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల హామీ కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవు.

హామీలు అమలు చేయకపోవడంతో రేవంత్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఎలాగైనా కొన్ని హామీలను అయినా అమలు చేయాలని భావిస్తున్న రేవంత్ సర్కార్.. ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే మద్యం ద్వారా రాబడి పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది.నెలకు మద్యం అమ్మకాలు 25% పెంచాలంటూ ఎక్సైజ్ శాఖకు టార్గెట్ పెట్టింది. టార్గెట్ పూర్తి చేయని 30 మంది అధికారులకు మెమోలు జారీ చేసింది ప్రభుత్వం. రెండోసారి మెమోలు పొందితే ఏడాది వరకు పోస్టింగ్ లేకుండా చేస్తామని హెచ్చరించింది. ఎమ్మెల్యేలు చెప్పినట్టు వినాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సమయంలో బెల్ట్ షాపులను నియంత్రిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు భిన్నంగా ఇప్పుడు అమ్మకాలు పెంచడానికి బెల్ట్ షాపులను పెంచి, అధికారులకు టార్గెట్లు పెడుతున్నారని నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లు.. ఎయిర్ పోర్టులో కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button