పక్కాగా గెలుస్తామనుకున్న హర్యానాలో ఓడిపోవడంతో కాంగ్రెస్ షాకైంది. ఏఐసీసీ పెద్దలు హర్యానా ఫలితాలపై పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్నారు. ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా.. బీజేపీ ఎలా గెలిచిందని కాంగ్రెస్ లీడర్లు అవాక్కవుతున్నారు. కొందరు నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు హ్యాక్ చేశారని ఆరోపిస్తున్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హర్యానాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యాయని ఆరోపించింది. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. హర్యానాలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని ఈసీకి కంప్లైంట్ చేశామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. 20 స్థానాల్లో హ్యాకింగ్ జరిగిందని, అందులో ఏడు స్థానాలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు ఈసీకి సమర్పించామని తెలిపారు.
Read More : రాహుల్‌ను ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు.. కాంగ్రెస్ ఖేల్ ఖతమేనా?
కర్నాల్, దబ్వాలి, రెవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా, నార్నాల్ నియోజకవర్గాల్లో హ్యాకింగ్ జరిగిందని పవన్ ఖేరా అన్నారు. మిగిలిన 13 స్థానాలకు సంబంధించిన హ్యాక్ ఆధారాలను రెండు రోజుల్లో ఈసీకి ఇస్తామని తెలిపారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున పోలింగ్ రోజు వాటిని ఈవీఎంలను పరిశీలించే వరకు వాటిని సీల్ చేసి భద్రపరచాలని ఈసీకి కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది.