
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- మూడేళ్ల క్రితం గట్టుప్పల మండలం ఏర్పాటవగా ఏడాది క్రితం మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటయింది. కాగా ఈ కార్యాలయంలో నేటికీ ఒక్క పోస్ట్ లో కూడా రెగ్యులర్ ఉద్యోగులు లేరు….అంత డిప్యూటేషన్ పై వచ్చిన వారే ఉన్నారు. ఎంపీడీవో, ఎంపీవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,రికార్డ్ అసిస్టెంట్ ఆఖరికి స్వీపర్ కూడా డిప్యూటేషన్(తాత్కాలికం) పైన వచ్చిన వారే ఉండడం గమనార్హం. సూపర్నెంట్ పోస్టు ఉండాల్సి ఉండగా ఎవరిని కేటాయించకుండా సీనియర్ అసిస్టెంట్ తోనే లాగించేస్తున్నారు. కనీసం ఇక్కడ అటెండర్ కూడా లేరు. స్వీపర్ తోనే కాలం వెళ్లదీస్తున్నారు. పోనీ మండల పరిషత్ కార్యాలయానికైనా సొంత భవనం ఉందా అంటే అది కూడా లేదు. గ్రంథాలయానికి నిర్మించిన భవనాన్ని ఎంపీడీవో కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఉండాల్సి ఉండగా ఎవరిని కేటాయించలేదు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ఆ విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంపీడీవో ఎంపీవో కూడా మేడ్చల్ జిల్లా నుంచి ఇక్కడికి డిప్యూటేషన్ పైన వచ్చారు. అసలే పంచాయతీ ఎన్నికలు ఉండడంతో సిబ్బంది కొరత చాలా ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.
Read also : హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం: 1 మృతి, 4 గురుకి గాయాలు.
Read also : జగిత్యాల జిల్లాలో ఘోరం: ప్రేమ జంటపై దాడి, అమ్మాయి కిడ్నాప్..!





