Monday, February 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అంద‌రి దృష్టి ఆ నాలుగు సీట్ల‌పైనే...!

అంద‌రి దృష్టి ఆ నాలుగు సీట్ల‌పైనే…!

  • పోటిలో 40 మంది
  • ముంద‌స్తుగానే అభ్య‌ర్థుల ఖ‌రారు

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్పుడు అంద‌రిదృష్టి రాజ్య‌స‌భ‌లో ఖాళీ కానున్న ఆ నాలుగు సీట్ల‌పై ప‌డింది. వ‌చ్చే జూన్ నెల‌లో ఖాళీ కాబోతున్న నాలుగు స్థాల‌నాలు ఇప్ప‌డు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. ఇంకా నాలుగు నెల‌లు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చ‌ర్చ కొనసాగుతుంది.

కాగా రాష్ట్రంలో కూట‌మికి ఉన్న బ‌లంతో ఆనాలుగు స్థానాలు ఏక‌గ్రీవం కానున్నాయా అంటే అవున‌నే సమాధానం వ‌స్తుంది. ఈ సీట్లు ఎవ‌రికి ద‌క్క‌నున్నాయి… ఏ పార్టీకి ఎన్ని సీట్లు ద‌క్క‌నున్నాయి.. ఎవ‌రు ఆ అదృష్ట వంతులు అనే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిన ఇలోచింప చేస్తుంది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే మూడు పార్టీలో ఒక ఒప్పందం కుదిరిన‌ట్లుగా తెలుస్తుంది. మొత్తం మొత్తం 4 స్థానాల్లో టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1 చొప్పున పంచుకోబోతున్నాయి. ఎస్సార్సీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ సీట్లు ఖాళీ అవుతుండడంతో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కసరత్తు వేగవంతం చేవారు.

తెలుగుదేశం పార్టీలో…
తెలుగుదేశం పార్టీకిద‌క్కే రెండు స్థానాల్లో ఒక‌టి సానా సతీష్‌ కు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోందికాగా మిగిలిన ఒక్క సీటు కోసం అమరావతిలో భారీ ఎత్తున లాబీయింగ్ జరుగుతోందనే చెప్ప‌వ‌చ్చు.

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వర్ల రామయ్య ఈ రేసులో ముందున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీ జనార్ధన్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

2024 ఎన్నికల్లో సోషల్ మీడియా బాధ్యతలు చూసి, పార్టీ గెలుపుకు దోహదపడిన చింతకాయల విజయ్ కూడా సీటు ఆశిస్తున్నారు. ఇక లోకేశ్ స్నేహితుడు కిలారి రాజేష్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా ఉండే సురేశ్ కోనేరు పేరు కూడా అమరావతిలో వినిపిస్తోంది. అంతేకాక భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ కూడా సీటు ఆశిస్తున్నారు.

జన‌సేన‌లో…
జనసేనపార్టీ కోటాలో ఒక సీటు ఉండటంతో ఆశావహుల జాబితా ఎక్కువ‌గానే ఉంది. ఇటు పవన్, అటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖాయమైందనే ప్రచారం చాలారోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆలోచన మారినట్లు సమాచారం.

సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ ప్రముఖుడిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. కాగా పార్టీ గళాన్ని వినిపిస్తున్న వేములపాటి అజయ్ కుమార్ లేదా పార్టీ కోసం త్యాగాలు చేసిన ఇతర సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉంది.

బీజేపీకీ…
బీజేపీ తన సీటును ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో అండగా నిలిచిన మందకృష్ణ మాదిగ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే అగ్రనాయకత్వం ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మందకృష్ణకు టీడీపీ, జనసేన కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు సమాచారం.

జూన్ లో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ, ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని కూటమి భావిస్తోంది. మొత్తానికి ఈ నాలుగు సీట్ల కేటాయింపు కూటమిలోని అంతర్గత సమీకరణాలను, భవిష్యత్తు రాజకీయ విధానాల‌కు అద్దంప‌ట్ట‌బోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments