
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి స్టార్ బ్యాటర్లైనటువంటి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలపై ఉంటుంది. ఎందుకంటే 2027 ఓడి వరల్డ్ కప్ లో వీళ్ళిద్దరూ ఆడాలంటే ఈ ఆస్ట్రేలియా సిరీస్ వీరికి కీలకం కానుంది. వరల్డ్ కప్ లో చోటు దక్కాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ తో పాటుగా ఫామ్ కూడా ఉండాలి. అప్పుడే ఏ క్రికెటర్ అయినా జట్టులో స్థానం సంపాదించుకోగలడు. కాబట్టి ఆస్ట్రేలియాతో జరగబోయేటువంటి వన్డే సిరీస్ లో మంచి ఫామ్ కనబరిస్తేనే వరల్డ్ కప్పు జట్టులో చోటు సంపాదించగలరు. ఒకవేళ విఫలమైతే మాత్రం కచ్చితంగా వీరికి ఇబ్బందులు తప్పవు. మరోవైపు సెలక్షన్ కమిటీ కూడా వీరిద్దరూ 2027 వరల్డ్ కప్పు ఆడుతారా?.. లేదా?.. అనేది స్పష్టంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఆస్ట్రేలియా తో జరగబోయేటువంటి ఓడి సిరీస్ లో ఎక్కువ పరుగులు చేసి రాణిస్తేనే వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించగలరు. మరోవైపు ఆస్ట్రేలియాపై వీరిద్దరికి కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయని చెప్పాలి. కేవలం ఆస్ట్రేలియా టీం పై రోహిత్ శర్మ 5, విరాట్ కోహ్లీ 5 సెంచరీలు చేసిన రికార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరు కూడా ఆస్ట్రేలియాతో జరగబోయేటువంటి వన్డే సిరీస్లో రాణించాలని… మేమంతా మీకు సపోర్ట్ గా ఉంటామని కామెంట్లు చేస్తున్నారు.
Read also : ఋతుపవనాల ఎఫెక్ట్… ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
Read also : నటులలో దేవుడు మహేష్ బాబే.. 5000 కు చేరిన ఉచిత గుండె ఆపరేషన్లు