
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం లో పర్యటించారు. MSME ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఇతర రాజకీయ నాయకులకు చాలా తేడా ఉంది అని అన్నారు. ఎందుకంటే వారు కేవలం మాటలు మాత్రమే చెబుతారు. కానీ నేను వారిలా కాదు.. మాట ఇచ్చే ముందు ఒకటికి మూడుసార్లు ఆలోచిస్తా.. ఒకసారి మాటిచ్చా అంటే కచ్చితంగా ఆ పని నీ నెరవేరుస్తా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అప్పట్లోనే నేను హైదరాబాదు అభివృద్ధి ప్రారంభిస్తే అది నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్ సిటీ గురించి ఈరోజుల్లో దేశ విదేశాలు చర్చించుకుంటున్నాయంటే దానికి ముఖ్య కారణం నేనే అన్నారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 17 నెలలు గడిచిన తర్వాత రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితిలు కనిపిస్తున్నాయి అని.. గతంలో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది అని.. పెట్టుబడుల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు అని తెలిపారు. మరోవైపు యువత భవిష్యత్తు కోసం వారు కన్న కలలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : సీనియర్ హీరోలతో నటించడానికి నాకు ఇబ్బంది లేదు.. కానీ ఆ పాత్రలు ఇక చేయను : మీనాక్షి చౌదరి
Read also : సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమయింది : డిప్యూటీ సీఎం పవన్





