క్రైమ్ మిర్రర్ స్పెషల్: పాములు అంటే చాలా మందికి గుండెల్లో ధడధడలు మొదలవుతాయి. అవి కంటబడితే ప్రాణాలు సైతం పక్కనపెట్టి పరుగులు తీస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు తమ గుహల నుంచి బయటికి వచ్చి మనుషుల నివాస ప్రాంతాల్లోకి వస్తుంటాయి. దీంతో స్నేక్ బైట్ ఘటనలు కూడా పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే తాచుపాము కాటు ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు. తగిన సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు. ఇవి సాధారణంగా ఎలుకలు, కప్పలు, చుంచులు సంచరించే చోట ఎక్కువగా ఉంటాయి. అయితే పాములు కనిపిస్తే సాధారణంగా జనాలు భయపడుతుంటే, కొంతమంది మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
Also Read:ఐఏఎస్ అధికారిణికి శారీరక, మానసిక వేధింపులు.. తుపాకీతో బెదిరింపు!
ఆ ప్రాణాంతక జంతువులను పట్టుకుని ఆటలాడాలని, తమ ధైర్యం చూపించాలని ప్రయత్నిస్తారు. చాలామంది స్నేక్ క్యాచర్లు అనుభవజ్ఞులే అయినా, ఒక్కసారైనా పరిస్థితి అదుపు తప్పితే ప్రమాదం తప్పదు. వేలు పాములు పట్టినవారికి కూడా కొన్ని సార్లు చిన్న పాము కాటు చావుకు దారి తీసిన సంఘటనలు ఉన్నాయి.
ఇటీవల ఒక స్నేక్ క్యాచర్ చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. తాచుపాము ప్రమాదకరమని తెలిసినా, అతను దాన్ని జాగ్రత్తగా బంధించకుండా ఆ పాముకి ముద్దు పెట్టి, నోట్లో పెట్టడం మొదలుపెట్టాడు. అతని ఈ విచిత్ర చేష్టలు చూసి చుట్టుపక్కలవారు విస్మయానికి గురయ్యారు.
Also Read:బక్తుల ఆగ్రహం… వేములవాడ రాజన్న దర్శనం మూసివేత
కొద్ది సేపు పాముకే ఏమవుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరి అయింది. చివరికి అతను దాన్ని ఓ సంచిలో పెట్టాడు కానీ, ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది. కొంతమంది ఇది ట్రెయిన్ చేసిన పామని, అందుకే అది కాటు వేయలేదని అంటుంటే, మరికొందరు వన్యప్రాణులను ఇలాగే హింసించడం తగదని మండిపడుతున్నారు.
సహజంగా ఉన్న జీవులను ఇలా ప్రదర్శనగా మార్చడం సరైన పద్ధతి కాదంటూ విమర్శిస్తున్నారు. పాముతో ఇలా ఆటలు ఆడడం ధైర్యమా, లేక పిచ్చిపనా? అని మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి.
Also Read:తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్ గా మారిన టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి!





