
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరు దృష్టిని ఆకర్షిస్తున్నారు రేణు దేశాయ్. గత రెండు రోజుల నుంచి మూగజీవాలపై వ్యాఖ్యలు చేస్తూ.. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. కుక్కలపై నటి రేణు దేశాయ్ మాట్లాడిన వ్యాఖ్యలకు గాను ఆమె ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు మరణిస్తుంది అని… ఇందులో మనుషులు కూడా ఉన్నారు అని ఆమె అన్నారు. డార్లింగ్ ప్రభాస్ నటించినటువంటి “కల్కి” సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు.. ఆ సినిమాలో చూపించిన విధంగా కలియుగం ఉంటుంది అని.. అక్కడికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్లాల్సిందే అని ఆమె వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రాణిపై ద్వేషం పెంచుకోవద్దని.. ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి అని ఆమె పిలుపునిచ్చారు. దీంతో మరోసారి ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.
Read also : డిప్యూటీ సీఎంను “సీఎం.. సీఎం” అంటూ కేరింతలు పెట్టిన యువత?
Read also : New Traffic Rule: ఐదు తప్పులు దాటితే లైసెన్స్ ఔట్, కేంద్రం కొత్త నిబంధనలు!





