క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన సొంతంగా జనసేన పార్టీని స్థాపించి నేటికీ 13 ఏళ్లు. ఒకప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ అంటే జనం మద్దతు లేకుండా.. ఒక సాదాసీదా పార్టీగా ఉండేది. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా ఒక కీలకమైనటువంటి పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ స్పెషల్ గా ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు ముందుకు సాగవు అని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో జనసేన పార్టీ కూడా కీలకమైన పార్టీగా.. ప్రజాదారణ పొందిన పార్టీగా ఎత్తుకు పై ఎత్తుగడులు వేస్తోంది. 2019లో దారుణంగా పరాజయం పొందినప్పటికీ 2024లో 100కి 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించడంతోపాటు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భవించి ఈ నేటికీ 13 ఏళ్లు. 2014లో ప్రశ్నించడానికే ఈ పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్లిన సందర్భంలో ప్రారంభంలో ఎన్నో అవమానాలు అలాగే ఓటములు చూశారు. కానీ 2024 ఎన్నికలలో జనసేన పార్టీ కూడా రాజకీయాల్లో కీలకమైన పార్టీగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు
Russian Oil Sales: పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. రష్యాకు లాభాల పంట!
తిరుమలాపూర్లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు!
