
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మేల్ బోర్న్ వేదికగా రెండవ టి20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే మ్యాచ్ ప్రారంభమై 2 ఓవర్లు సాఫీగా సాగిన ఆ తరువాత వరుసగా వికెట్లు పడిపోయాయి. భారత ఓపినర్ గిల్ 5, సూర్య కుమార్ యాదవ్ 1, సాంసన్ 2, తిలక్ వర్మ 0 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో భారత్ కు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం గ్రీస్లో అభిషేక్ శర్మ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు. ఒకవైపు అక్షర పటేల్ దూకుడుగా రాణిస్తున్న మరోవైపు ఎవరూ కూడా అంతగా పర్ఫామెన్స్ చేయడం లేదు. ఈ మ్యాచ్లు ఆస్ట్రేలియన్ బౌలర్స్ హజల్ వుడ్ 3 వికెట్లు, ఎల్లిస్ ఒక వికెట్ తీసుకున్నారు. రెండవ టి20లో భారత్ గెలుస్తుందని ప్రతి ఒక్క ఇండియన్ అభిమాని కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో చాలా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 7 ఓవర్లకు 47 పరుగులు చేసింది.
Read also : ఉక్కు మనిషి ఆశయాలతో – రన్ ఫర్ యూనిటీ
Read also : స్వయానా ముఖ్యమంత్రి దంపతులే దగ్గరుండి పెళ్లి జరిపించారు..!
 
				 
					
 
						 
						




