క్రీడలు

ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025 ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 గత డిసెంబర్ నెల లో ఐపీఎల్ మెగా యాక్షన్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఐపీఎల్ 2025 లో ఆటడం లేదని ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ క్రికెట్ ప్లేయర్ చెప్పిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంగ్లాండ్ దేశానికి ఆడడమే తన ప్రాధాన్యత అని… రాబోయే సిరీస్ ల కోసం ప్రిపేర్ అయ్యేందుకు ఈ సంవత్సరం ఐపీఎల్ కు దూరమవుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా ఈ క్రికెట్ ప్లేయర్ ను ఐపీఎల్ మెగా యాక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం

ఆక్షన్ లో ఎంపికై టోర్నీలో పాల్గొనకపోతే రెండేళ్లు నిషేధం విధిస్తామని ఐపీఎల్ తాజాగా కొత్త రూల్స్ను తీసుకువచ్చింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ పై రెండు సీజన్ల పాటు ఐపీఎల్ లో ఆడడానికి వీలుకాదు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆరు కోట్లు వెచ్చించి మరి ఈ ప్లేయర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా బ్రూక్ అన్యాయం చేసినట్లు అయింది. ఈ క్రికెటర్ కు వెచ్చించిన 6 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వడమే కాకుండా రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్లో ఆడడానికి కుదరదు. అయితే ఇవన్నీ తెలిసి కూడా బ్రూక్ తన దేశం కోసం ఐపీఎల్ కు గుడ్ బాయ్ చెప్పారు. మరి దీనిపై ఢిల్లీ క్యాపిటల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ ఊడి పడి ఇంటర్ విద్యార్థినికి గాయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button