Homeక్రైమ్ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా...

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన వైనం

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల తనిఖీల్లో మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. ఆరు కొత్త విద్యుత్‌ మీటర్ల మంజూరు కోసం లంచం డిమాండ్‌ చేసిన విద్యుత్ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సంతోష్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని మాదన్నపేట సెక్షన్‌లో రాకేశ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆరు కొత్త విద్యుత్‌ మీటర్ల మంజూరు కోసం ఓ వ్యక్తిని రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.1,20,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ రాకేశ్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచాలు డిమాండ్‌ చేసే అధికారులపై ఏసీబీ నిఘా కొనసాగుతోంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

also read: దొరికిన బ్యాగులో రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీ.. ఆశపడకుండా పోలీసులకు అప్పగించిన వ్యక్తి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు