కేంద్రం తెలంగాణకు 151 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు
వేగవంతం కానున్న రవాణ వ్వస్థ
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కొనసాగనుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలవైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రయాణీకుల సౌకర్యార్థం రవాణ వ్యవస్థను బలోపేతం దిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ-బస్ సేవా పథకం ద్వరా తెలంగాణలోని వరంగల్ జిల్లాకు 100, నిజామాబాద్ జిల్లాకు 51 చొప్పున 151 బస్సులను కేటాయించింది.
దీంతో ప్రయాణీకులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. దీంతో కేంద్ర పట్టణాభివృద్దిశాఖ సహాయ మంత్రి టోకన్ సాహు రాజ్యసభలో వెల్లడించారు.మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర మంత్రి టోకన్ సాహు వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.
ఇక 2022-25 మధ్య కాలంలో వరంగల్‌కు 3.52 లక్షల మంది, గోల్కొండకు 47.41 లక్షల మంది, చార్మినార్‌కు 35.85 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
సందర్శకులకు టికెట్ల విక్రయం ద్వారా గత మూడేళ్లలో గోల్కొండ నుంచి రూ.15.30 కోట్లు, చార్మినార్ నుంచి రూ.9.30 కోట్లు, వరంగల్ నుంచి రూ.73.71 లక్షల ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లోరద్దీ ఎక్కువగా పెరిగింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసున్నప్పటి నుంచి బస్సులు ఖాళీగా ఉండటం లేదు. తాజాగా కేంద్రం ప్రకటించిన బస్సులతో రద్దీ తగ్గే అవకాశం ఉన్నట్లు పలువురు ప్రయాణీకులు పేర్కొంటున్నారు.
