Thursday, March 12, 2026
Homeజాతీయంఆయన ఆరోపణలు అర్థరహితం, రాహుల్ పై ఈసీ సీరియస్!

ఆయన ఆరోపణలు అర్థరహితం, రాహుల్ పై ఈసీ సీరియస్!

Ec Serious On Rahul Gandhi: భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనవన్నీ అర్థం లేని ఆరోపణలుగా కొట్టిపారేసింది. వ్యాసాలలో ఈసీ గురించి విశ్వసనీయత లేని ఆరోపణలు చేస్తే స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. బీజేపీ ఓటమి ఖాయం అనే చోటల్లా ఈసీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్ లోనూ అదే జరగబోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ పత్రికకు రాసి వ్యాసంలో ఆయన ఆరోపణులు చేశారు.

రాహుల్ ఆరోపణలు అర్థరహితం!

రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలపై స్పందించేందుక ఎన్నికల సంఘం నిరాకరించింది. ఆయనవన్నీ అర్థం లేని ఆరోపణలుగా కొట్టిపారేసింది. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా  నేరుగా తమకు నేరుగా లేఖ రాస్తే స్పందిస్తామని తెలిపింది. పేపర్లలో రాసిన వ్యాసాలకు స్పందించలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు గత ఏడాది డిసెంబర్ 24లోనే అన్ని వివరాలను వెల్లడించినట్లు వివరించింది. ఆ వివరాలను ఈసీ వెబ్‌ సైట్‌ లోనూ పొందు పరిచినట్లు తెలిపింది. ఈ ఆరోపణల గురించి చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించినట్లు వివరించింది. 5 పార్టీలు ఈ మీటింగ్ లో పాల్గొనగా, కాంగ్రెస్ మాత్రం రాలేదన్నారు.

నేరుగా లేఖ రాస్తే స్పందిస్తాం!

ఎన్నికల నిర్వహణ మీద ఎవరికి అభ్యంతరాలు ఉన్నా, నేరుగా తమకు లేఖరాయాలని ఎన్నికల సంఘం సూచించింది. తాను లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవి అని చెప్పిన రాహుల్, తమకు లిఖిత పూర్వకంగా ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర పోలింగ్ కేంద్రాల్లో సాయంత్ర వేళ ఓటింగ్ గురించి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని రాహుల్ తన వ్యాసంలో డిమాండ్ చేశారని, ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తే సంబంధిం హైకోర్టు సదరు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించవచ్చిన తేల్చి చెప్పింది.

Read Also: తోకాడిస్తే సర్వ నాశనమే, ఉగ్రవాదులకు షా స్టాంగ్ వార్నింగ్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments