
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీలో ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ఆశావాహులు మొత్తం కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వారి వారి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో ఓ నాయకుడి పైన కొంతమంది గిట్టను వారు కరపత్రాన్ని విడుదల చేయడం ఓ సంచలనంగా మారింది. కానీ దీన్ని అన్ని పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఓ నాయకుడిని ఎదుర్కోవాలంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండి చేయాలి గాని… ఇట్లా కరపత్రాలు రూపంలో వ్యవహరించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం ప్రజలే కాదు అన్ని వర్గాల ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే దీనిపైన పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ పోలీస్ శాఖ బృందాలు రంగం లోకి దిగినట్టు అత్యంత విశ్వసించిన సమాచారం. ఇది ఇలా ఉండగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా అభ్యర్థులు నిమగ్నమయ్యారు. మూడో వార్డులో ఓ జర్నలిస్టు అభిమానులు ఇంటింటికి చికెన్ పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బీసీ జనరల్ చైర్మన్ రిజర్వేషన్ అయినట్లుగా తెలిసింది. ఇక 10 వార్డులలో ఏ రిజర్వేషన్ అయితుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Honeytrap: భార్య మరో పురుషుడితో న్యూడ్‌గా ఉండగా వీడియోలు తీసిన భర్త





