
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-
ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల బోర్డర్లు మూసివేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఇరుదేశాల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బియ్యం, చక్కెర, మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యవసర సరుకుల ధరలు రెండు దేశాల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరియు ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ప్రస్తుతం కిలో టమోటా ధరలు ఐదు రెట్లు పెరిగిపోయాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ లో కిలో టమోటా ధరలు 90 లేదా 100 రూపాయలు పలకగా నేడు ఏకంగా కిలో టమోటా 600 పాకిస్తాన్ రూపాయలు పలుకుతున్నాయి. మరోవైపు ఫ్రూట్స్ ధరల సైతం విపరీతంగా పెరిగిపోయాయి. ఇరుదేశాల్లో వ్యాపారం స్తంభించిపోయిందని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సమాచారం అందింది. ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్ మరోవైపు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ప్రతిరోజు ఒక మిలియన్ నష్టపోతున్నాయని అక్కడ వ్యాపార వర్గాలు వెల్లడించడంతో సోషల్ మీడియా వేదికగా కొంతమంది పాకిస్తాన్ కు ఇలాంటి గతేపట్టాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందిన తర్వాత ఇరుదేశాల మధ్య వైరము ఇంకా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రెండు బోర్డర్లు మూసివేయగా… ఇరుదేశాల్లో నిత్యవసర సరుకులు భారీగా పెరిగి ప్రజలపై భారం పడుతుంది అని రెండు దేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also : కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. యజమానులకు హెచ్చరికలు చేసిన పొన్నం
Read also : రెండో వన్డేలోనూ ఓడిన భారత్… అసలు లోపాలు ఇవే?





