తెలంగాణ

సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ దూకుడు..

– చైల్డ్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్‌ పై విచారణ

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ బ్యూరో : సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ కేసు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. చైల్డ్ ట్రాఫికింగ్‌, మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు డాక్టర్‌ నమ్రత, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్‌కృష్ణలను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు అక్కడికే వెళ్లి విచారిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు వారిని ఈడీ ప్రశ్నించే అవకాశం

Also Read:మేడ్చల్ లో దారుణం – తండ్రిని హత్య చేసిన కొడుకు

తొలుత సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలో గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయగా, ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులు అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.

సోదాల సమయంలో ఈడీ బృందం భారీ స్థాయిలో ఆస్తులు, బ్యాంకు పత్రాలు, హవాలా లావాదేవీల ఆధారాలు స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రకారం, డాక్టర్‌ నమ్రత సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ నడిపి, దాదాపు 86 మంది శిశువులను అక్రమంగా విక్రయించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Also Read:ఏపీ ఇంటర్ విద్యార్థులు అలర్ట్… పరీక్షల మార్కులలో మార్పులు?

ఈ వ్యవహారంలో సుమారు రూ.40 కోట్ల వరకు హవాలా రూపంలో దేశ, విదేశీ లావాదేవీలు జరిగినట్లు ఈడీ దర్యాప్తు వెల్లడించింది. అంతేకాకుండా, విదేశీ ఖాతాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఆధారాలు దొరికినట్లు సమాచారం.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న డాక్టర్‌ నమ్రతను ఈడీ అధికారులు వివరంగా స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తూ, ఆమెతో సంబంధం ఉన్న ఇతర వైద్య కేంద్రాలు, సహచరులపై కూడా విచారణ జరుపుతున్నారు.

మరోవైపు, నిందితుల ఆస్తుల మూలాలు, హవాలా లావాదేవీలకు సంబంధించి ఫైనాన్షియల్ ట్రెయిల్‌ ను అనుసరిస్తూ అధికారులు మరిన్ని సోదాలకు సన్నాహాలు చేస్తున్నారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ మరియు అక్రమ లావాదేవీలపై పూర్తి సాక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం. కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది, అని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

Also Read:ఢిల్లీలో పొల్యూషన్ పంచాయతీ…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button