
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- గ్రామంలో వీధి దీపాల సమస్యలు లేకుండా చూస్తాం అని సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అన్నారు. మంగళవారం మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో పలు వార్డులలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ ఆధ్వర్యములో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 90 వీధి దీపాలు,ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి వీధి దీపాలు ఏర్పాటు చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకోని గ్రామాన్ని వెలుగులతో నింపేందుకు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా,గ్రామంలో అవసరమైన చోట వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని. గ్రామంలో ప్రతి కాలనీలో వీధి దీపాల సమస్య లేకుండా చూస్తామని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 90 వీధిలైట్లు కాలనీలలో వేయించడం జరిగింది అన్నారు.గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు..ఉప సర్పంచ్ ఉప్పునూతల సుగుణమ్మ, వార్డు సభ్యులు నారగోని అనూష జగన్, సద్దల కళ్యాణి శ్రీశైలం,శ్రీరామోజు వెంకటేశ్వర్లు,ఉప్పునూతల శ్రీశైలం,వివిధ వార్డు సభ్యులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
Read also : Army Chief: పాక్ కవ్వింపు చర్యలు.. భారత ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
Read also : Army Chief: పాక్ కవ్వింపు చర్యలు.. భారత ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!





