
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- అక్టోబర్ 17వ తేదీన విడుదలైన డ్యూడ్ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్లను రాబడుతుంది. ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లుగా తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ కలెక్షన్లను చూసిన ప్రేక్షకులు షాకు కు గురయ్యారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 22 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తమిళంలో యంగ్ హీరో… లవ్ టుడే తర్వాత రెండు సినిమాలు వచ్చిన కూడా ఆ తర్వాత వచ్చినటువంటి ఈ డ్యూడ్ సినిమాతో మరో రికార్డ్ సృష్టించారు. ఈ కలెక్షన్లను చూస్తుంటే మరో రెండు మూడు రోజుల్లో 100 కోట్లు దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యంగ్ హీరోకు మొదటి రెండు రోజుల్లోనే ఇన్ని కలెక్షన్లు రావడం ఇదే మొదటిసారి.ఇదే సమయములో మరోవైపు తెలుగులో రిలీజ్ అయినటువంటి కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ సినిమాలు ఎక్కువ కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. ఈసారి దీపావళికి ప్రదీప్ రంగనాథన్ న్యూ సినిమాతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకోవడమే కాకుండా… దీపావళికి డ్యూడ్ సినిమాతో ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
Read also : టారిఫ్స్ కాదు ఓయ్… నీ దేశం మీద దృష్టి పెట్టు.. అంటూ నెటిజన్స్ ఆగ్రహం!
Read also : బీసీ బంద్… హింసాత్మక ఘటనలకు పాల్పడిన 8 మంది అరెస్ట్!