ఆంధ్ర ప్రదేశ్

DSC అభ్యర్థులు అలర్ట్.. 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ మెగా డీఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అలర్ట్ అవ్వండి. ఈనెల 19వ తేదీన జరగాల్సినటువంటి అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమం వర్షాల కారణంగా కూటమి ప్రభుత్వం వాయిదా వేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో మళ్లీ ఎన్ని రోజులు వాయిదా వేస్తారో అని అభ్యర్థులందరూ కూడా అయోమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఈ మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఈనెల 25వ తేదీన డీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్లు తిరిగి పంపిణీ చేయనున్నామని కూటమి ప్రభుత్వ అధికారులు అభ్యర్థులకు అప్డేట్ ఇచ్చారు. ఈనెల 25వ తేదీ గురువారం అమరావతి లోని సచివాలయం వెనుక భాగంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని ప్రకటించారు. గురువారం ఏ సమయంలో అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులలో కొంతమందికి సీఎం చంద్రబాబు నేరుగా నియామక పత్రాలను అందజేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

Read also : 9వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

కాగా గత ఐదు సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎంతో ఓపికగా ఈ డీఎస్సీ పరీక్ష కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్ష కాస్త గందరగోళం లోనే జరిగిన.. చివరికి 16,000 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. వీరందరూ కూడా దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా చాలా కష్టపడి ఈరోజు ఉద్యోగాన్ని సంపాదించారు. ఇన్ని రోజులుగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అని, కాల్ లెటర్స్ అని ఓపికగా ఎదురు చూశారు. ఇక చివరిగా ఈ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తే ప్రశాంతంగా ఉండునున్నారు. డీఎస్సీ పరీక్షలో భాగంగా ఎంతోమంది ఎన్నో ఒత్తిళ్ళను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. చివరిగా ఇన్నాళ్ల కష్టం ఫలించింది అని చాలామంది అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వర్షం కారణంగా 19వ తేదీన జరగాల్సిన కార్యక్రమం 25వ తేదీన జరుగుతుందని అధికారులు నేడు స్పష్టత ఇచ్చారు.

Read also : చిన్నపిల్లాడిలా ఏంటి జగన్ ఇది : హోం మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button