క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు(ఎం): యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం) మండలం, పల్లెర్ల గ్రామంలో కరెంట్ లేక ఎండిపోతున్న పంట పొలాలను చూస్తూ కన్నీరు పెడుతున్న రైతులు. ఈ సందర్భంగా రైతు సామ నరేందర్ రెడ్డి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ… సమయానికి కరెంట్ లేక నాలుగు ఎకరాల పంట పొలం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కష్టాలతో రైతన్నలకు చాలా ఇబ్బంది అవుతోంది అని ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కోరారు. జెనరేటర్లు పెట్టి నడిపించిన గాని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఎండా కాలం వచ్చిందని కరెంట్ కోత ఇట్లాగే ఉంటే ఎండిపోయిన పొలాలను చూసుకుంటూ ఏడుపు తప్ప రైతన్నలకి మరొకటి లేదని అన్నారు.
రైతన్నలు రాజులు అయితారో కారో తెలియదు గాని అప్పుల బాధతో చావుకు మాత్రం దగ్గర అవుతున్నారని అన్నారు. ఎండిపోయిన పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
