Homeక్రైమ్Prank Death: ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. ప్రాణాలు పోయాయి!

Prank Death: ప్రాంక్ చేద్దామనుకున్నాడు.. ప్రాణాలు పోయాయి!

సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత ప్రాంక్స్ హవా నడుస్తోంది. ఫన్నీగా అనిపించే ప్రాంక్ వీడియోలు  మిలియన్ల కొద్దీ వ్యూస్ తెస్తున్నాయి. ప్రాంక్‌ చేసేవారికి మంచి గుర్తింపు తెస్తున్నాయి. అయితే, కొంతమంది నిజ జీవితంలోనూ ప్రాంక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాంక్‌లు ఫెయిల్ అవుతున్నాయి. ప్రాంక్‌లు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి తాగిన మత్తులో తల్లితో ప్రాంక్ చేయాలని చూశాడు. ఊహించని విధంగా ప్రాంక్ ఫెయిల్ అయి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరు రూరల్ జిల్లా, నేలమంగళలోని రోహిత్ నగర్‌కు చెందిన 28 ఏళ్ల విజయకుమార్ తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతీరోజూ విపరీతంగా మందు తాగేవాడు. డబ్బుల కోసం తల్లిని బాగా వేధించేవాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరిగాయి. తాజాగా మందు తాగడానికి డబ్బులు కావాలని విజయ్ తన తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో విజయ్ ఆగ్రహానికి గురయ్యాడు. తల్లిని బెదిరించి డబ్బులు గుంజడానికి ఓ ప్రాంక్ చేశాడు.

ఉరేసుకుని చస్తానని బెదిరిస్తూ..

రాత్రి 8 గంటల సమయంలో ఉరి వేసుకుని చస్తానని తల్లిని బెదిరించే ప్రయత్నం చేశాడు. తలకు ఉరి తాడును బిగించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఉరి తాడు గట్టిగా బిగుసుకుని అతడి ప్రాణాలు పోయాయి. కొడుకు చనిపోవడంతో తల్లి అల్లాడిపోయింది. “నా కొడుకు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. అతడి త్వరలో పెళ్లి చేయాలనుకున్నాను.  ఎప్పుడూ నవ్వు తెప్పించేలా మాట్లాడుతూ ఉండేవాడు. ఉరి వేసుకునే ముందు కూడా జోకులు వేశాడు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments