
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా రాజకీయ జీవితంలో పొరపాటున కూడా ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు అని కేటీఆర్ తెలిపారు. 2015వ సంవత్సరంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమేమి చేశామో ప్రతి ఒక్కరికి తెలుసు అని.. ఆనాటి కాలంలోనే మా ఎమ్మెల్యే లందరినీ కూడా కొనేందుకు 50 లక్షల రూపాయలతో వచ్చినటువంటి ఒక దొంగను పట్టుకున్నాము అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ దొంగనే ఏకంగా సీఎం అయ్యాడు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము భయపడేది లేదు అని.. కేవలం నోటీసులు ఇస్తేనే భయపడతాము అని అతను భావిస్తున్నాడు అనుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేము ఎటువంటి తప్పు చేయనప్పుడు పోలీసుల ముందు హాజరవ్వడానికి కూడా మాకు ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు.
Read also : కుటుంబాలను నాశనం చేస్తున్న అక్రమ సంబంధాలు..!
Read also : ఇవాళ వసంత పంచమి.. ఈ పనులు అస్సలు చేయకండి





