
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- వైఎస్ జగన్.. మాజీ ముఖ్యమంత్రి. చేతిలో అధికారం లేదు. పోయినా ఆయనకు ఉన్న ప్రజాదరణ అంతాఇంతా కాదు. ఆయన కాలు బయటపెడితే చాలు… జనం తండోపతండాలుగా తరలివస్తారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా… అభిమానులు వెనకడుగు వేయరు. కాలినడకన అయినా తరలివస్తారు. జగన్‌ను చూసి.. ఆయన్ను పలకరించి… ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంత ప్రజాదరణ ఉన్న జగన్ భద్రత విషయంలో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు సరైన భద్రత కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన భద్రత పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దించుతున్నారు జగన్.
Read also: అరెస్ట్ చేసినా భయపడేది లేదన్న కేసీఆర్ – కాళేశ్వరంపై నెక్ట్స్ స్టెప్ ఏంటి..?
జగన్ ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినా… జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొన్ని పర్యటనల సమయంలో జరిగిన సంఘటనలు.. జగన్ భద్రతపై భాయందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో.. ఇటీవల జరిగిన వైసీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ చర్చించారు పార్టీ నేతలు. పోలీసుల నుంచి జగన్‌కు సరైన భద్రత కల్పించడంలేదన్నారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకూడదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు… వైఎస్ జగన్‌కు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు వెళ్తే.. ప్రైవేట్ సిబ్బందే ఆయన భద్రతా బాధ్యతలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also : నయా సైబర్ మోసం – 87లక్షలు జమచేసి మూడు కోట్లు లూటీ
జగన్ భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ ఆర్మీలో… 40 మంది ఉండనున్నారు. ఇప్పటికే 10 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది సేవలను జగన్ భద్రత కోసం వైసీపీ వినియోగిస్తోంది. ఇప్పుడు కొత్తగా.. మరో 40 మందిని నియమించబోతున్నారు. వీరు.. జిల్లాల పర్యటన సమయంలో వైఎస్ జగన్ దగ్గరకు జగనం దూసుకురాకుండా నియంత్రిస్తారు. రోప్ పార్టీగానూ విధులు నిర్వర్తిస్తారు. ఈనెల 6న వైఎస్ జగన్ డోన్ పర్యటన ఉంది. ఆ పర్యటన నుంచే ప్రైవేట్ సైన్యం.. జగన్ భద్రతా బాధ్యతలు చూసుకుంటుంది.
Read also : కాళేశ్వరం కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం