-
తేల్చి చెప్పనున్న కాంగ్రెస్
-
నియోజకవర్గాల పునర్విభజనను సైతం
-
బిజెపి రాజకీయ వ్యూహంగా హస్తం అనుమానం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. బిజెపి దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని ఆలోచన చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు, చర్చించేందుకు ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ఉభయసభలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ రెండు అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కాంగ్రెస్ పార్టీ మల్లు గుల్లాలు పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. అయితే వీటిపై ఎలా స్పందించాలో తెలియక కాంగ్రెస్ పార్టీ తెగ మదన పడుతోంది.
-
నేతల ఏకాభిప్రాయం..
తాజాగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఈ రెండు అంశాలపై చర్చలు జరిపారు. నియోజకవర్గాల పునర్విభజనను గుడ్డిగా సమర్ధించడానికి వీలులేదని తీర్మానించారు. జనాభా ఆధారంగా జరగాల్సిన నియోజకవర్గాల పెంపు వ్యవహారాన్ని జనాభాతో సంబంధం లేకుండా.. కేవలం బిజెపి తన రాజకీయ కోణంలోనే చూస్తోందని.. తద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి బలం పెంచుకునేందుకు అవకాశం గా ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. అందుకే నియోజకవర్గాల పునర్విభజనపై అభ్యంతరాలు తెలపాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు 50 శాతానికి పెరిగితే.. అది అంతిమంగా బిజెపికి లాభం చేకూర్చేది అవుతుందని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
-
ఒకేసారి ఎన్నికలపై అనుమానం..
జమిలి ఎన్నికలపై కూడా నేతలంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా విడివిడిగా జరుగుతున్న ఎన్నికలను.. ఇప్పుడు జమిలి ఎన్నికలుగా మార్చడం వెనుక బిజెపి రాజకీయ వ్యూహాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న జమిలి ప్రతిపాదనను సైతం వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ ఈసీ పై పోరాడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జమిలి నిర్వహణకు ఒప్పుకుంటే బిజెపికి అది అడ్వాన్స్డ్ గా మారే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఈ రెండు అంశాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన బిజెపి వెనక్కి తగ్గే అవకాశం లేదు. అందుకే కూటమిలకు అతీతంగా మిగతా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ….
-
రేపు ఉదయం 11 గంటలకు.. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల
-
తెలంగాణ పోలీస్ బాస్ సివి ఆనంద్…!
-
మహబూబ్‌నగర్‌లో వేడెక్కిన రాజకీయం…ఇద్దరు నేతలు మాటల యుద్దం…!
-
ఆపరేషన్ ఐలాపూర్…6 అంతస్తుల భవనం నేలమట్టం…!
-
చిరకాల శత్రువు చెంతకు జీవన్ రెడ్డి.!
-
Big breaking: ఆపరేషన్ ఖగార్ ఎఫెక్ట్…మరో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు…!
