
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అలాగే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ప్రతిరోజు కూడా లక్షల్లో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు దేవాలయంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు అనేవి ఎంతైనా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఏకంగా 10 నుంచి 15 గంటల సమయం పడుతున్న సందర్భంగా… ఆ సమయాన్ని తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ఏఐ ద్వారా రెండు లేదా మూడు గంటలలోనే సామాన్య ప్రజలు కూడా దర్శనం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Read also : రాష్ట్రంలో మరో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తల్లి, ఇద్దరు కుమార్తెలు బలి!
అయితే ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ఈవో LV సుబ్రహ్మణ్యం స్పందించారు. రెండు లేదా మూడు గంటల్లో సామాన్య ప్రజలకు శ్రీవారి దర్శనం అవ్వడం అనేది అసంభవం అని అన్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించిన కూడా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాలలో చిన్న మార్పులు చేర్పులు చేయవచ్చేమో కానీ.. పూర్తిగా మాత్రం మార్పులు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రస్తుత రోజుల్లో AI ను ఉపయోగించి చాలానే పనులు చేస్తున్నారు. ఈ ఏఐ పేరుతో ఆ వెంకటేశ్వర స్వామి ధనాన్ని వృధా చేయడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. దీనికి బదులుగా భక్తులకు ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. కాబట్టి ఇప్పటి విధి విధానాలు అంతే ఉంచి… భక్తులకు అప్డేటెడ్ గా ఏవైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read also :గుండాల మండలంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్