
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడులోని ఎరువుల డీలర్ షాపులను వ్యవసాయాధికారి పద్మజ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరికీ బయోస్ అనే పేరిట అమ్మే మందులను కొనేముందు జాగ్రత్తగా చెక్ చేసుకుని తీసుకోవాలన్నారు. లైసెన్సు ఉన్న డీలర్ షాపులలోనే కొనుగోలు చేయాలని సూచించారు.కొనుగోలు చేసిన బిల్లును, ఉపయోగించిన మందుల పాకెట్లను జాగ్రత్తపరుచుకోవాలన్నారు. లైసెన్స్ లేని, బిల్లు ఇవ్వని ప్రదేశాలలో ఎరువులు,పురుగు మందులు, ఆర్గానిక్/ బయోస్ అని చెప్పే వాటిని ఎవరూ కొనుగోలు చేయకూడదని,ఆర్గానిక్ లేదా సేంద్రియ వ్యవసాయం అంటే రైతులు స్వంతంగా తమ దగ్గర ఉన్న వనరులతో, వేపాకు,ఇతర ఆకులు, పేడ, పశువుల ఎరువు, పంటల అవశేషాలు వంటి వాటితో స్వయంగా తయారు చేసుకుని వాడుకోవాలినీ తెలిపారు.
Read also : Honeymoon Horror: హనీమూన్ మర్డర్ 2.0.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త లేపేసిన కిలేడీ!
Read also: US-India Trade Agreement: అమెరికా టారిఫ్ కట్.. మరో వారంలో అమల్లోకి!





