ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ వ్యక్తులు చెప్పే ఫేక్ మాటల్ని నమ్మకండి : TDP

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చాలా మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రజల్లో లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారు అని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది పని కట్టుకొని మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పనులు చేశారు అనేది.. విశాఖ ఉక్కు అభివృద్ధికి ఎలాంటి పనులు చేశారో ప్రత్యేకంగా కేంద్ర మంత్రులు మాట్లాడిన మాటలను మరోసారి వినాలి అంటూ ఎక్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ ఒక వీడియోను విడుదల చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ పరం అవదు అంటూ ఆ వీడియోలలో చాలామంది కేంద్ర మంత్రులు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ వంటి ఎంతోమంది రాజకీయ నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తామని నిర్ణయించలేదు. మరి అలాంటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంది అంటూ ఫేక్ వ్యక్తులు చెప్పే ఫేక్ మాటలను కూడా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలు చేసేవారు ఎక్కువైపోయారని.. వారిని మట్టి కరిపించే బాధ్యత మాది అని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఇదేవిధంగా స్టీల్ ప్లాంట్ కు మరిన్ని అభివృద్ధి పనులు జరిగేలా.. కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్ కు అన్ని విధాలుగా సహాయపడేలా చేస్తాము అని సీఎం వివరించిన విషయం తెలిసిందే.

Read also : IND vs SA మ్యాచ్.. ఆంధ్రాలో అడుగుపెట్టనున్న రోహిత్, కోహ్లీ

Read also : మేము అనుభవించేదంతా వెంకన్న దయ వల్లే.. తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణలు : యాంకర్ శివ జ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button