
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్లాస్టిక్ ను నిషేధించింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను తక్షణమే నిషేధిస్తున్నామని దేవాలయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం ప్రతి ఒక్కరికి తెలిసేలా ప్రతి ఆలయంలో బోర్డులు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ఆలయ అధికారులకు స్పష్టం చేసింది. ఇకపై ఏ ఆలయంలో అయినా కూడా 120 మైక్రాల కంటే తక్కువ మందం ఉండే కవర్ల స్థానంలో కాటన్, సూట్ లేదా పేపర్ బ్యాగులు మాత్రమే వాడేలా చూడాలి అని… సామాన్య భక్తులకు అధికారులే దగ్గరుండి వాడేలా చూడాలి అని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరించారు.
నేటి ముఖ్యాంశాలు.. మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ లో చదివేయండి!
భక్తులకు అర్థమయ్యే రీతిలో ప్లకార్డులను ఏర్పాటుచేసి వీలైనంత వరకు ప్లాస్టిక్ ను వాడకుండా చూడాలని కోరారు. ఇకపై అన్ని దేవాలయాలలో అరిటాకులు లేదా స్టీల్ ప్లేట్లలో మాత్రమే అన్నప్రసాదం వడ్డించాలి అని కోరారు. ఇకనుండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఆలయాల్లోకి అనుమతించొద్దు అని క్లియర్ గా చెప్పుకొచ్చారు. గంటలపాటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు నీరు త్రాగడానికి స్టీల్ మగ్గులు లేదా స్టీల్ గ్లాసులు అందుబాటులో ఉంచాలి అని దేవాదాయశాఖ ఆదేశించింది. ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ ఎక్కువైన కారణంగా… ముందుగా ప్రధాన ఆలయాలలో ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లుగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా మంది ప్రజలు కూడా దేవాదాయ శాఖ ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెల్లిగా రాష్ట్రమంతటా కూడా ప్లాస్టిక్ ను ఇలానే నిషేధిస్తూ పోవాలని అధికారులకు విన్నపిస్తున్నారు.
Read also: భారత పర్యటనకు పుతిన్, ఎప్పుడు వస్తారంటే?