క్రైమ్తెలంగాణ

గాడిద పాల కుంభకోణం.. వందల కోట్లు మాయం

తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన గాడిద పాల కుంభకోణం కలకలం రేపుతోంది. బాధితులు వందలాదిగా బయటికి వస్తున్నారు. మార్కెట్‌లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందనే ప్రచారాన్ని నమ్మి అడ్డంగా మోసపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వందలాది మందిని బురిడీ కొట్టించి 100 కోట్ల రూపాయలకుపైగా కాజేశాడు కేటుగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తమ గోడు వెళ్లబోసుకున్నారు గాడిద స్కాం బాధితులు.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా ముక్కుడల్‌‌లో డాంకీ ప్యాలెస్‌ పేరుతో ఫామ్ మొదలుపెట్టాడు బాబు ఉలగనాథన్. తన ఫామ్ దగ్గర యూ ట్యూబ్‌లో వీడియోలు తీస్తూ లీటరు గాడిద పాలను 16 వందల రూపాయల నుంచి 18 వందల రూపాయల వరకు కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని.. కానీ డిమాండ్‌ తగ్గ సరఫరా చేయలేకపోతున్నానని, ఎవరైనా తనకు గాడిద పాలు సప్లై చేస్తే తీసుకుంటానని.. నెలకు లక్షన్నర వరకు ఆదాయం వస్తుందని ఊదరగొట్టాడు. యూ ట్యూబ్ ఛానల్ వీడియోలు చూసి చాలామంది నిజమని నమ్మి లక్షల్లో ఉలగనాథన్ కు సమర్పించుకున్నారు.

ఒక్కో గాడిదకు కనీస ధర 90 వేల నుంచి లక్షన్నర వరకూ వసూలు చేశాడు కేటుగాడు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా 75వేల నుంచి లక్షన్నర వరకు కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు. ఫ్రాంచైజీలో సభ్వత్వం పేరుతో మరో 5 లక్షల రూపాయలు.. గాడిదల వైద్యం నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్‌‌ను చూపించి.. ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో 50 వేల రూపాయలు నొక్కేశాడు.

ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షలు నుంచి కోటిన్నర వరకు వసూలు చేశాడని బాధితులు వాపోయారు. ఉలగనాథ్‌తో పాటు గిరి సుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేశ్ అని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తిరునల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాలన్ హాజరయ్యారని.. ఆయనకు ఇందులో వాటా ఉందనే అనుమానం వ్యక్తం చేశారు బాధితులు. తాము కలెక్టర్‌ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు. ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button