
Trump Comment: తాజాగా షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి మాట్లాడుకోవడంపై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ముగ్గురు దేశాధినేతలు కలిసి ఉన్న ఫొటోను ట్రూత్ తో పోస్టు చేశారు. “మనం.. ఇండియాను, రష్యాను చీకటి దేశమైన చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది” అని రాసుకొచ్చారు. ఆ మూడు దేశాలూ చిరకాలం వర్ధిల్లాలంటూ వ్యంగ్యంగా విమర్శించారు. అటు ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై తక్షణం స్పందించాలని భావించడం లేదన్నారు. ఆలోచించి తమ అభిప్రాయం చెప్తామన్నారు.
టెక్ దిగ్గజాలకు ట్రంప్ విందు
అటుయాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాల అధిపతులకు ట్రంప్ వైట్ హౌ్‌స్ లో డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్‌పిచాయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సత్య నాదెళ్ల బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. టిమ్ కుక్, బిల్‌గేట్స్, మెటా జుకెర్‌బెర్గ్, శామ్ ఆల్ట్ మన్ తదితర టెక్ దిగ్గజాలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ సుందర్ పిచాయ్ ని ఉద్దేశించి.. అమెరికాలో గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటోందని ప్రశ్నించగా.. దానికి ఆయన వచ్చే రెండేళ్లలో 250 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.22 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెడతామని చెప్పారు. ట్రంప్ ఆయనను ప్రశంసించారు.