
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మన భారతదేశంలో అత్యంత ధనవంతులైన పదిమంది మంత్రుల జాబితాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా రాజకీయం అంటేనే ప్రతి ఒక్కరు కూడా సేవతో కూడుకున్న పని అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి బయటకు తెలిసినా అసలు నిజం డబ్బు. మీరు విన్నది నిజమే… ధనం మూలం.. ఇదం జగత్ అని సినిమాల్లో ఊరికే చెప్పలేదు. రాజకీయాల్లో ప్రస్తుతం డబ్బు అనేది కీలకపాత్ర పోషిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఆర్థికపరంగా చాలా బలంగా ఉన్నారు. ఎటు చూసినా.. చిన్నచిన్న కార్పొరేటర్ల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా చాలామంది ధనవంతులు ఉన్నారు.
Read also : కొత్త జిల్లాలపై సరికొత్త డిమాండ్లు.. ఈనెల 15లోపు నివేదిక!
మన భారతదేశంలో అత్యధిక ఆస్తి విలువ ఉన్న నాయకుడు ఎవరు అని అడిగితే.. చాలామంది వరకు జ్యోతిరాధిత్యా సింధియా మరియు డీకే శివకుమార్ పేరులను చెబుతారు. ఎందుకంటే వీరిద్దరూ కూడా రాజుల కుటుంబానికి చెందిన వారు కాబట్టి. సాధారణంగా శివకుమార్ పెద్ద వ్యాపారవేత్తని భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వీరందరికీ మించి మన భారతదేశంలోనే ఎక్కువ ఆస్తి విలువ ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే మన భారతదేశంలో అత్యధిక ఆస్తి విలువ ఉన్న టాప్ 10 మంత్రులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంత్రి ఏకంగా భారతదేశంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా రికార్డ్ సృష్టించాడు.
టాప్ 10 మంత్రులు
1. పెమ్మసాని చంద్రశేఖర్ – (తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్) 5075 కోట్లు
2. డీకే శివకుమార్ – ( కాంగ్రెస్, కర్ణాటక) 1413 కోట్లు
3. చంద్రబాబు నాయుడు – ( తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్) 931 కోట్లు
4. నారాయన్ పొంగురు – ( తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర ప్రదేశ్) 824 కోట్లు
5. బిఎస్ సురేష్ – (కాంగ్రెస్, కర్ణాటక) 648 కోట్లు
6. కడం వివేకానంద – ( కాంగ్రెస్, తెలంగాణ) 606 కోట్లు
7. నారా లోకేష్ – ( తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్) 542కోట్లు
8. మంగళ్ ప్రభాత్ -( బిజెపి, మహారాష్ట్ర ) 447 కోట్లు
9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి -( కాంగ్రెస్, తెలంగాణ) 433 కోట్లు
10. జ్యోతిరాధిత్యా సింధియా -( బిజెపి, మధ్యప్రదేశ్)
Read also : 2027 డిసెంబర్‌కు SLBC పూర్తిచేస్తామన్న సీఎం.. ఇది సాధ్యమేనా?