
క్రైమ్ మిర్రర్, లైఫ్ స్టైల్ న్యూస్:- ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ మరియు ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. 18 సంవత్సరాలు దాటిని మైనర్ కుర్రాళ్ళు కూడా మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. సినిమా హాల్లోకి ఎంటర్ అవగానే.. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పినా కూడా ఎవరూ మానే పరిస్థితిలో లేరు. ఇవి రెండు ఆరోగ్యానికి హానికరమైన కూడా మరొక డేంజరస్ అలవాటు వీటిని మించి ఉంది. అదేంటి అంటే.. పనిని వాయిదా వేయడం. ఎవరైనా సరే పనులను వాయిదా వేసే అలవాటు ఉన్న వారు స్మోకింగ్ మరియు ఆల్కహల్ సేవించే వారి కంటే డేంజరస్ అని కొంతమంది కోచ్ లు చెబుతున్నారు. చిన్న చిన్న పనులను మొదలుకొని.. పెద్ద పెద్ద పనులు వరకు కూడా ప్రతి ఒక్కరూ చేయాలనుకున్నా లేదా చేయాల్సిన పనిని సకాలంలోనే పూర్తి చేయాలి అని లైఫ్ స్టైల్ కోచ్ లు సూచిస్తున్నారు. టైం ఉంది కదా అని తర్వాత చేద్దాంలే అనుకోవడం పొరపాటు అని.. దీనివల్ల మీ ఆలోచనలు, పనిలోని క్వాలిటీ వంటి అంశాలను చంపేస్తుంది అని పేర్కొన్నారు. ఈ పనులను వాయిదా వేయడం వల్ల మీ లైఫ్ మొత్తం జీరో అవుతుంది అన్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ కొంతమంది హెచ్చరిస్తున్నారు. కాబట్టి స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కంటే ఎక్కువగా పనిని వాయిదా వేసే అలవాటు ఉన్నవారు వెంటనే మార్చుకోవాలి అని హెచ్చరించారు. లేదంటే ఎంతటి వ్యక్తి అయినా సరే వెంటనే కిందకి పడిపోతాడు అని సూచిస్తున్నారు.
Read also : తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు!.. IMD కీలక ప్రకటన
Read also : పరీక్షలు బహిష్కరణ.. నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్
				
					
						




