
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే అంత సులభం కాదు. ఇలా చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఎన్నికలకు ఒకసారి పార్టీ నాయకులు వేరే పార్టీలోకి మారిపోతున్నారు. ఒక సంవత్సరం ఈ పార్టీ పరిపాలన చేస్తే మరో సంవత్సరం వేరే పార్టీ పరిపాలన చేస్తూ ఉంటుంది. కాబట్టి రాజకీయం అన్నప్పుడు ఏమైనా జరగవచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సరిగ్గా ఉత్తరాంధ్ర రాజకీయాలు కూడా ఇలానే ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అనగానే ప్రతి ఒక్కరికి వైసీపీ పార్టీ చాలా దూకుడుగా, వైసిపి పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు భావించేవారు. అందరూ అనుకున్నట్టుగానే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలు ఒకప్పుడు వైసీపీకి బలమైన కంచుకోటలా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ గ్రాఫ్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎలక్షన్లో ఓటమి చెందిన అనంతరం.. వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు పెద్దగా ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు, బయటకు కూడా రావట్లేదు. ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చాలా గట్టిగా మాట్లాడింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడడం లేదు. విశాఖపట్నంలో అసలు వైసీపీ నాయకుల చురుకుదనమే కనిపించడం లేదు.
Read also :దీపావళి రోజు ఈ వస్తువులు పడేసేముందు ఓసారి ఆలోచించండి..?
ఇక ఇదే తరుణంలో టీడీపీ అలాగే బీజేపీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మల్లి పుంజుకుంటున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఆ పార్టీ ముఖ్య నేతలు దూకుడును కనబరుస్తున్నారు. వైసీపీ తరఫున కేవలం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్ప ఇతర పెద్ద నాయకులు ఎవరూ కూడా అంతగా కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమిస్తారో వారి రాబోయే రాజకీయ సమీకరణాలలో బాగా ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసిపి నిర్లక్ష్యం వహిస్తుంది అని స్పష్టంగా అర్థం అవుతుంది. బట్టి వైసీపీకి ఉత్తరాంధ్రలో కాస్త మైనస్ గా యవారం పూర్తిగా మారింది. ఈ తరుణంలోనే బిజెపి, టిడిపి మరియు జనసేన పార్టీలు ఉత్తరాంధ్ర రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నాయి.
Read also : విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు.. గిట్టుబాటు ధరలు కూడా లేవు : వైయస్ జగన్