సినిమా

“అఖండ-2” కలెక్షన్లు ఎంతో తెలుసా..?

AKHANDA-2 :-నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ-2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డిసెంబర్ 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లుగా సినీవర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిసెంబర్ 12 నుంచి ఇప్పటివరకు 88.25 కోట్లు రాబట్టినట్లుగా పేర్కొన్నాయ్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదలై 11 రోజులు పూర్తి చేసుకోగా ప్రతిరోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరిట ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ప్రతి ఒక్కరు కూడా చూడడానికి థియేటర్లకు వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. ఇక ఇప్పటినుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అఖండ మొదటి సినిమా కన్నా అఖండ-2 అంతగా మెప్పించలేకపోయింది అని ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు.

Read also : వైజాగ్ వచ్చిన ప్రతి క్రికెటర్ సింహాచలం వైపే.. ఆ దేవాలయం ఎందుకంత స్పెషల్?

Read also : హిందువులారా దయచేసి మేల్కోండి.. బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించండి : కాజల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button