
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి నల్లమల్ల అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ నల్లమల అటవీ ప్రాంతాన్ని దాటుకొని శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గాన దేవస్థానానికి అలాగే కృష్ణానది డ్యాం చూడడానికి వెళ్తారు. ఈ శ్రీశైలం ఘాట్లో ఎన్నో అడవి మృగాలు ఉన్నాయి. అయితే తాజాగా మార్కాపురం టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి అబ్దుల్ రావూఫ్ శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఎన్ని పులులు ఉన్నాయో ప్రకటించారు. మొత్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో 87 పెద్ద పులులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అదే 2022వ సంవత్సరంలో 74 పులులు మాత్రమే ఉన్నట్లుగా తెలిపారు. ఈ 74 పులుల సంఖ్య 2025వ సంవత్సరానికి వచ్చేసరికి గణనీయంగా పెరిగినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 87 పులులు ఉన్నాయని.. ఈ పులులకు సంరక్షణకు అన్ని విధాలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. కాగా ఈ నల్లమల అడవి ప్రాంతం చూడడానికి చాలా దట్టమైన అడవిలా కనిపిస్తుంది. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎన్నో పులులను మనం కొన్ని సందర్భాల్లో చూసుంటాము. ఎక్కువ పులులు సంచరిస్తున్న కారణంగానే ఫారెస్ట్ అధికారులు రాత్రి వేళలు వాహనదారులకు అనుమతి లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎవరైనా శ్రీశైలం ఘాట్ రోడ్లో వెళ్తున్న సమయంలో ప్లాస్టిక్ కానీ వాటర్ బాటిల్స్ కానీ, తిండి పదార్థాలు కానీ వేయకూడదని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటివి చేస్తే జరిమానా కూడా విధిస్తామని అధికారులు వాహనదారులకు సూచించారు.
Read also : దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి… ఏం చెప్పారో తెలుసా?
Read also : దానధర్మాలకు, వ్యసనాల జోలికి పోకుంటే నేటికీ 1000 కోట్లు ఉండేవి : జగపతిబాబు