
క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి జిల్లా:- గుండాల మండలంలోని బండకొత్త పెళ్లి గ్రామంలో విషాదంగా మారాయి. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాల్లో గ్రామస్తులు వాహనాలను అలంకరించి, ఊరంతా ముత్యాలమ్మ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈసారి కూడా అదే ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుడి చుట్టూ ట్రాక్టర్లు తిప్పుతున్న క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్న జనాల మీదికి ట్రాక్టర్ దూసుకెల్లడంతో రామగిరి శ్రీరాములు(52) ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. దురదృష్టవశాత్తు ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురై, అక్కడికక్కడే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతుడి బంధువులు ట్రాక్టర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జనగామ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతి సంవత్సరం ఆనందంగా, భక్తి భావంతో జరిగే బోనాల వేడుకలు ఈసారి ప్రాణహాని కలిగించడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read also : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇంతకీ ఏంటీ ఆయన బ్యాగ్రౌండ్!
Read also : నిజంసాగర్ ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు.. గేట్లు ఎత్తే అవకాశం!