
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:-
మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని దర్గా వద్ద అపశృతి చోటుచేసుకుంది. మొక్కు తీర్చుకొనుటకు వచ్చిన యువకుడు విద్యుత్ తీగలు తాకి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూర్ లైన్ గడ్డ కు చెందిన, మాజీద్ (32) గురువారం రోజు కాలేశ్వరం లోని సయ్యద్ షా వాలి బాబా, పగుకుల రహదారి వైపు ఉన్న దర్గా వద్ద తమ మొక్కు తీర్చుకొనుటకు మరో మిత్రుని తో కలిసి దర్గాకు వచ్చి మొక్కు చెల్లించుకునే క్రమంలో, నిశాన్ తీసుకు వెళ్తున్న క్రమంలో పై ఉన్న ఏవి విద్యుత్ తీగలకు నిశాన్ పైప్ తగలడంతో మజీద్ మృతి చెందడం జరిగింది. నిశాన్ సమర్పిస్తున్న క్రమంలో పైన ఉన్నటువంటి విద్యుత్ తీగల పై దృష్టి సాధించకపోవడం ఒక నిండు ప్రాణానికి బలిగొంది. ఎలక్ట్రిషన్ వృత్తి చేసుకుంటూ తమ కుటుంబానికి ఆసరాగా ఉన్న మజీద్ దర్గా వద్ద ముక్కు చెల్లించుటకొనుటకు వచ్చి మృత్యువాత పడడం యావత్ చెన్నూరు పట్టణ కేంద్రమంతా శోక సముద్రంలో మునిగింది. అనుకున్న పని పూర్తి పూర్తయిన క్రమంలో మోక్కు చెల్లించుకుని వస్తానని ఎంతో ఆనందంగా ముస్తాబయి వెళ్లిన మజీద్ శబమై రావడం జీర్ణించుకోలేక పోయారు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుడు, మృతి చెందిన మజీద్ కు భార్యతో పాటు 18 నెలల కుమారుడు ఉన్నాడు.
Read also : ఈ ఒక్క అలవాటుతో ప్రాణాంతక వ్యాధుల ముప్పు.. వైద్యుల హెచ్చరిక
Read also : మూత్రపిండాలలో రాళ్లు ప్రమాదకరమా..?





