
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలని యాదాద్రి భువనగిరి జిల్లా, బిజెపి అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అన్నారు. ఆత్మకూరు(ఎం)మండలంలోని పుల్లాయిగూడెం గ్రామంలో తడిసిన విమలమ్మ ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను గ్రామ సర్పంచ్ నర్రాముల రామలింగయ్య యాదవ్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. గ్రామీణ యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని,కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహ పరిచారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కాశీనాథ్,మత్స్యగిరి,జిల్లా నాయకులు బొట్టు అబ్బయ్య, ఇంద్రారెడ్డి,సత్యనారాయణ, పాండు రంగారెడ్డి,భువనగిరి పార్లమెంట్ సోషల్ మీడియా కో కన్వీనర్ ఉదయ్ కుమార్,ఉప సర్పంచ్ తండ రమేష్,మండల నాయకులు బండి ఉప్పలయ్య, కోల సోమేష్, పొడుగు వెంకటేష్, మణికాంత్ ,టోర్నీ నిర్వాహకులు సుభాష్ రెడ్డి, మహేష్, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read also : వ్యక్తిగతంగా పరువు తీసే బదులు కాస్త విషం ఇచ్చి చంపండి : కోమటిరెడ్డి





